లలితా సహస్రనామం – Lalitha Sahasranamam Lyrics Telugu Book PDF Free Download

Lalitha Sahasranamam Stotram Lyrics And Namavali
శ్రీ లలితాదేవి ఆంధ్రుల ఆరాధ్య దేవత. త్రిగుణాత్మిక. త్రిపుర సుందరి. సమస్త జగత్తుకు ఆధారమామె. చైతన్య స్వరూపిణి. సృష్టికార్యమునకు మూలము. మూలశక్తి స్వరూపిణి. సమస్త శక్తులకు ఆధారము. సాకార బ్రహ్మ స్వరూపిణి.
బ్రహ్మము అప్రజ్ఞాతము, అలక్షణము, అప్రతర్క్యము, అనిర్వచనీయము, అభావ్యము, నామరూపాతీతము, అవ్యక్తము. అట్టి తత్త్వము యొక్క సూక్ష్మాతి సూక్ష్మ వ్యక్త రూపముగ నిలచునది అమ్మతత్త్వము. అయ్య అవ్యక్తుడు. అమ్మ అయ్య యొక్క ప్రతి నిధి. పరతత్వము యొక్క ప్రథమ వ్యక్తి స్వరూపము లేక సంకల్పము.
ఈ సంకల్పమే మొదటి వెలుగు. అనగా ప్రధానము, అదితి, చైతన్య స్వరూపిణి, గాయత్రి యిత్యాది నామములచే గ్రహింపబడునది. త్రిగుణాత్మక సృష్టికి మూలము.
అనగా త్రిమూర్తులకు పుట్టుక స్థానము. త్రిశక్తులకు పుట్టుక స్థానము. సమస్త సృష్టికి పుట్టుక స్థానము. సృష్టి కథకు వెండి తెర. పరమాత్మచే సంకల్పింపబడుట వలన వెలిగి యున్న తెర. సృష్టి సినిమాకు ఆధార భూతము. మాయాతీత ఆరాధనము చేత భక్తులను తన మాయనుండి తరింప చేయు అనుగ్రహ రూపిణి.
సమస్త సృష్టి శక్తులు ప్రణాళికలు ఆమె అధీనము కావున, ఆమె ఆరాధకులకు ఆమెయే సమస్త శక్తియును మరియు భుక్తియును.
అమ్మ సౌందర్య స్వరూపిణి. ఆమె ఆరాధనము అత్యంత వైభవోపేతము, ఆనంద భరితము మరియు ఉల్లాస కారణము. రస స్వరూపిణి కావున సాధన మార్గమంతయు ఆహ్లాదకరముగ భాసించును. అమ్మను గూర్చిన స్తోత్రములలో “లలితా సహస్ర వామము”” ను మించిన స్తోత్రము లేదనుట నిర్వివాదము.
ఈ స్తోత్రము అగస్త్య మహర్షికి హయగ్రీవుడు ఉపదేశించినది. ఇందు సకల మంత్ర, తంత్ర యంత్ర, యోగసాధనములు నిక్షేపింపబడినవి. వేదాంగములను ప్రయోగించి తెలిసినవారు – నిక్షిప్తమైన రహస్యములను పాఠకలోకమునకు అందించుటకు యిందు అపారమైన విజ్ఞాన సంపద కలదు. ఎవరు ఏ దృక్పథమున పరిశీలించిన, వారికి ఆ దృక్కోణము నుండి రహస్య ప్రకాశ మొనర్చి తుష్టి నందించగల దివ్యస్తోత్ర రాజమిది.
విష్ణునామ సహస్రాచ్చ శివనామైకముత్తమమ్ శివనామ సహస్రాచ్చ దేవ్యానామైక ముత్తమమ్.
విష్ణునామ సహస్రము కంటే శివనామ మొకటి ఉత్తమమైనది. శివనామ సహస్రము కంటే దేవీ నామ మొకటి ఉత్తమమైనది. ఇది బ్రహ్మాండోత్తర పురాణ వాక్యం. జగద్గురువులు శ్రీ ఆది శంకర భగవత్పాదులు “శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం జ త్వాం ధన్యాః కతిచన చిదానందలహరీమ్” – “మహాంతః పశ్యంతో దధతి పరమానంద లహరీమ్” అని దేవీ మాహాత్మ్యాన్ని స్తుతించారు.
నామ స్తోత్రాలలో లలితా రహస్యనామ స్తోత్రం ఉత్తమోత్తమమైనది. ఇది బ్రహ్మజ్ఞాన సంపన్నమై, వేదాంత బోధకమై, శ్రీ చక్ర బ్రహ్మాండ పిండాండ సామరస్య ప్రతిపాదకమై, యంత్ర మంత్ర పూజా విషయ ప్రబోధకమై, యోగశాస్త్ర రహస్యాలతో, కర్మ మార్గాన్ని, భక్తి -మార్గాన్ని, ఉపాసనా మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని ప్రతిపాదించునట్టిదై అలరారుతోంది.
ఈ నామ సహస్రంలో దేవి బాహ్య సౌందర్య వర్ణనతో పాటు, ఆమె మూర్తిమూర్త స్వరూప వర్ణన కూడా పొందుపరచబడింది.
Author | – |
Language | Telugu |
No. of Pages | 321 |
PDF Size | 20 MB |
Category | Religious |
Telugu Lalitha Sahsranaman Stotram PDF is given in 4 parts you can download it from the below link and it is a complete Book PDF. Each part contain around 200 shlokas with detail meaning
Lalitha Sahasranamam Mp3
You can download or listen to Lalitha Stotram
లలితా సహస్రనామం – Lalitha Sahasranamam Lyrics Telugu Book PDF Free Download