పితృ తర్పణము – విధానము | Amavasya pitru tarpanam PDF In Telugu

‘Amavasya pitru tarpanam’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Amavasya pitru tarpanam’ using the download button.

పితృ తర్పణము – విధానము – Amavasya pitru tarpanam PDF Free Download

పితృ తర్పణము – విధానము

సెప్టెంబర్‌ 25 నుంచి మహాలయ పక్షం

మనం చేసే పని మీద నమ్మకం, భక్తి శ్రద్ధలు ఉండాలి. మనల్ని కనిపెంచిన, పెద్ద చేసిన పితరుల పట్ల గౌరవం, పూజ్య భావం ఉండాలి. ఇది మన కనీస బాధ్యత. మనల్ని చూసి మన సంతానం నేర్చుకోవలసి సంప్రదాయం ఇది. మనకు ఋషులు కల్పించిన మహదవకాశం ‘మహాలయం’.

పితృ ఋణాన్ని తీర్చే పర్వం పితృపక్షం. అదే ‘మహాలయం’గా ప్రసిద్ధి చెందింది. .మహం ఆలం యాత్‌ ఇతి మహాలయం’ అని వ్యుత్పత్తి. చాలినంత తృప్తిని పితరులు ఈ పక్షంలో తమ పుత్రులు చేసిన తర్పణాదుల ద్వారా పొందుతారు కనుక దీన్ని ‘మహాలయ పక్షం’ అని చెబుతారు.

‘‘అమావస్యే దినే ప్రాప్తే గృహద్వారాయే సమాశ్రితః

వాయుభూతాః ప్రవాంఛతి శ్రాద్ధాం పితృగణానృణామ్‌- అని గరుడ పురాణం పేర్కొంటోంది. అమావాస్య దినం రాగానే పితృ దేవతలు వాయు రూపంలో తమ వారి ఇళ్ళకు వచ్చి, సూర్యాస్తమయం వరకూ ఉండి, తమ వారు శ్రాద్ధ కర్మలు నిర్వహించి, అన్నదానాలు చేస్తే సంతృప్తి పొంది, ఆశీర్వదించి వెళ్తారట!

లేకుంటే అసంతృప్తి చెంది, శాపనార్ధాలతో నిందించి, తిరుగుముఖం పడతారని గరుడ పురాణ వచనం.

నిజమే మరి! బిడ్డకు జన్మనిచ్చిన తల్లితండ్రులు… కోటి ఆశలతో పెంచి, పెద్ద చేసి, విద్యా బుద్ధుల ద్వారా ఒక స్థాయికి తెచ్చిన వారు… తమ చరమ దశలో ఆదుకుంటాడని ఆశించడం అసహజం కాదు.

అలాకాక, మరోలా ప్రవర్తిస్తే ఏమనాలి? ఊపిరి ఆగిన తరువాత తమకు జన్మనిచ్చిన వారి అంత్యేష్ఠిని భక్త శ్రద్ధలతో నిర్వహించి, కర్మకాండ జరిపించడం పితృఋణం తీర్చినట్టు కాదు.

మూడు ఋణాలు

ప్రతి మానవుడు మూడు విధాలైన ఋణాలతో పుడతాడు. అవి దేవ ఋణం, ఋషి ఋణం, పితృ ఋణం. ధర్మబద్ధమైన నిత్య నైమిత్తిక కార్యాచరణలతో ఈ మూడు ఋణాల నుంచి విముక్తుడవుతాడు. ‘యజ్ఞేవ దేవేభ్యః’ అని శాస్త్ర వచనం. క్రతువులు చేయడం, చేయించడం ద్వారా దేవగణాలు సంతృప్తి చెందుతాయి. అలా దైవఋణం తీరుతుంది. ‘బ్రహ్మచర్యేణ ఋషిభ్యః’- అంటే బ్రహ్మచర్యం ద్వారా ఋషి ఋణం తీర్చాలి.

ఇక మూడవది పితృ ఋణం. ‘ప్రజయా పితృభ్యః’ అని శాస్త్రవచనం. సంతానంతో పితృ ఋణం తీరుతుంది. ఇది పరంపరానుగతమైనది. దీనికి విఘాతం కలిగించకూడదు. తగిన వయసులో వివాహం చేసుకొని, సంతానాన్ని పొందాలి. తద్వారా పితృ దేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాదులు నిర్వహించాలి.

మనం ఎలాంటి పితృకార్యం నిర్వహిస్తున్నా ఐదుగురు పితృ దేవతలు మన వాకిటి ముందు వాయురూపంలో నిరీక్షిస్తారు. వారు- తండ్రి, తాత, ముత్తాత, తల్లి తండ్రి, తల్లి తాత. వీరికి తర్పణాదులు, పిండ ప్రదానాలు తప్పక చేయాలనీ, అప్పుడే పితృ ఋణం తీరుతుందనీ పెద్దలు చెబుతారు. గరుడ పురాణం కూడా ఇదే విషయాన్ని తెలియజేసింది.

పితృ యజ్ఞం

మహాభారతంలో, అంపశయ్య మీద ఉన్న భీష్ముడు పితృ యజ్ఞాన్ని గురించి ధర్మరాజు కోరిక మేరకు వివరంగా చెప్పాడు. ‘‘దైవ పూజ కన్నా పితృ పూజే గొప్పది. పితృ దేవతలతో పాటు దేవగణాలూ సంతృప్తి చెందుతాయి. పితృ సమారాధనం సర్వ శుభసాధనం. ప్రతి అమావాస్య నాడు భక్తితో పితృ యజ్ఞం నిర్వహించాలి. అలా చేస్తే సంవత్సరమంతా పితృయజ్ఞం నిర్వహించిన ఫలం ప్రాప్తిస్తుంది’’ అని తెలిపాడు. సాధారణంగా ప్రతి అమావాస్య నాడు లేదా పితరులు మరణించిన రోజున శ్రాద్ధ కర్మలను మన పితృ దేవతలకు మాత్రమే పరిమితం చేస్తాం. కానీ, పితృ పక్షాలలోనూ, మహాలయ అమావాస్య నాడు సామూహిక శ్రాద్ధాలు… అంటే మన వంశంలోని పితృ దేవతలకూ, చనిపోయిన బంధు మిత్రులకూ, ఎంతమందికి వీలయితే అంతమందికి పిండ తర్పణాది కార్యక్రమం నిర్వహించవచ్చు. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు పితృ పక్షం. ఆ అమావాస్యను ‘మహాలయ అమావాస్య’ అని పేర్కొంటారు. ఈ పేరు వెనుక ఒక కథ మహా భారతంలో ఉంది.

కర్ణుడి నుంచి మొదలు!

కురుక్షేత్ర సంగ్రామంలో మరణించిన కర్ణుని జీవాత్మ స్వర్గ మార్గంలో ప్రయాణం సాగించింది. కర్ణుడు బ్రతికున్న కాలంలో అర్థించిన వారందరికీ లేదనకుండా దానం చేసి, దానకర్ణుడుగా కీర్తి గడించాడు. అలాంటి కర్ణుడికి మార్గమధ్యలో ఆకలిదప్పులు కలిగాయి. చెట్టుకు పండిన పండును కోసుకు తిందామంటే, అది బంగారంగా మారింది! జలం తాగి ఆకలి తీర్చుకుందామంటే దోసిలిలో నీరు బంగారమయింది! కర్ణుడికి ఏమీ అర్థం కాలేదు. తండ్రి అయిన సూర్యుణ్ణి ప్రార్థించాడు. ప్రత్యక్షమైన సూర్యుడికి తన గోడు చెప్పుకొని, పరిష్కారం అడిగాడు.

అప్పుడు సూర్యుడు ‘‘నాయనా! నువ్వు దానకర్ణుడివే! అనుమానం లేదు. నీ సంపదనంతా దానం చేశావు. ఇంద్రుడు కోరితే సహజ కవచ కుండలాలనే దానం చేశావు. కానీ, ఒక్క రోజైనా, ఒక్కరికైనా అన్నదానం చేయలేదు. దాని ప్రభావమే ఇది!’’ అని చెప్పాడు. పరమాత్మ అనుమతితో కర్ణుడిని సశరీరంగా భూలోకానికి పంపిస్తూ, అన్నదానం చేయాల్సిందిగా సూచించాడు. కర్ణుడు సశరీరునిగా భూలోకానికి వచ్చిన రోజు భాద్రపద కృష్ణ పాడ్యమి. నాటి నుంచి పదిహేను (పక్షం) రోజులపాటు ఆకలి గొన్నవారికి అన్నదానాలు జరిపాడు. బంధు మిత్రులకు శాద్ధ కర్మలూ, తర్పణాదులూ నిర్వహించి, తిరిగి స్వర్గానికి పయనమయ్యాడు.

నాటి నుంచి భాద్రపద మాస శుక్ల పక్షం దైవ కార్యాలకూ, కృష్ణ పక్షం పితృ యజ్ఞాలకూ పరిమితం అయ్యాయి. కృష్ణ పక్షాన్ని మహాలయ పక్షంగా వ్యవహరిస్తారు. ఈ పక్షం రోజులూ పితృ యజ్ఞం నిర్వహించాలనీ, వీలుకాని పక్షంలో అమావాస్య నాడు నిర్వహించాలనీ స్కాంద పురాణం చెబుతోంది. మన తాత ముత్తాతలు తృప్తి చెందితే… వారి అనుగ్రహం వల్ల మన తరువాతి తరాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రబలమైన ధార్మిక విశ్వాసం. ఆ కారణంగానే పితృ కార్యాలకు మన శాస్త్రాలు అత్యంత ప్రాధాన్యం కల్పించాయి. శుభకార్యాలైన ఉపనయ, వివాహ సందర్భాల్లో కూడా పితరుల పట్ల శ్రద్ధా భక్తులు ప్రకటించే ఘట్టాలు చేటు చేసుకుంటాయని గమనించాలి.

భాద్రపదమాస కృష్ణ పక్షం మహాలయ పక్షం. ఈ రోజుల్లో శాస్త్ర విధిని అనుసరించి పితృ దేవతలను తృప్తి పరచాలి. పితరుల తృప్తి కోసం ఈ పుణ్య క్రతువును యాచన చేసి అయినా నిర్వర్తించాలనీ, అది ధర్మ సమ్మతమేననీ శాస్త్రం చెబుతోంది. ‘‘ప్రతిఫలం ఆశించకుండా ఇలాంటి శ్రాద్ధ కర్మలు విధిగా ఆచరించాలి. వంద యజ్ఞాలు చేసిన ఫలం కన్నా పితృ దేవతలకు తర్పణాలు విడవడం వల్ల లభించే ఫలం ఎంతో ఎక్కువ’’ అని ఏనాడో మన మహర్షులు చెప్పారు. – ఎ. సీతారామారావు

పితృ దేవతలకు శ్రాద్ధం చేసినపుడు , తర్పణము కూడా అందులో భాగం గా చెయ్యాలి. దీనిని చదివి , బ్రాహ్మణుడు దొరకకున్ననూ , ఎవరికి వారు తర్పణము చేయవచ్చును 

తర్పణము అర్థము , అవసరము , ప్రాశస్త్యము వంటి వాటి గురించి వేరొక చోట వ్రాయుచున్నాను ) 

ముగ్గురు పితృ దేవతలను బ్రాహ్మణులలో ఆవాహన చేసి కూర్చోబెట్టి చేసే శ్రాద్ధాన్ని ’ పార్వణ శ్రాద్ధం ’ లేక ’ చటక శ్రాద్ధం ’ అంటారు..కొన్ని సాంప్ర దాయాలలో బ్రాహ్మణులు లేకుండా కేవలము కూర్చలలో పితృదేవతలను ఆవాహన చేస్తారు ..

.తగిన కారణము వలన అది కూడ వీలు కానప్పుడు క్లుప్తముగా చేసే శ్రాద్ధాలు… దర్శ శ్రాద్ధము , ఆమ శ్రాద్ధము , హిరణ్య శ్రాద్ధము.

ఆ పద్దతి ముందుగా ఇచ్చి , తదుపరి తర్పణ విధి వివరించడమయినది..

దర్శాది హిరణ్య / ఆమ శ్రాద్దం

పుణ్య కాలే | దర్భేషు ఆశీనః | దర్భాన్ ధారయమాణః | ఆచమ్య , పవిత్ర పాణిః ప్రాణానాయమ్య |

ఓం భూః ..ఓం భువః…ఓగ్ం సువః.. ఓం మహః.. ఓం జనః.. ఓం తపః.. ఓగ్ం సత్యం..| …..ఓం తత్సవితుర్వరేణ్యం | భర్గో దేవస్య ధీమహి | ధియో యోనః ప్రచోదయాత్ |

ఓమాపోజ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్

సంకల్ప్య || శ్రీగోవింద గోవింద……దేశకాలౌ సంకీర్త్య , .అస్యాం పుణ్య తిథౌ 

| ప్రాచీనావీతి |

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం … —– గోత్రాణాం. .. —— , ——– , —— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——– గోత్రాణాం , ——- , ——— ,——-దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … —— గోత్రాణాం , ——–, ———- , ——— శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం ,

——–, ———— , ————— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం , అమావాస్యా పుణ్యకాలే ( సంక్రమణ పుణ్యకాలే ,/ సూర్యోపరాగ పుణ్యకాలే / సోమోపరాగ పుణ్యకాలే / వస్వాది పుణ్యకాలే ) దర్శ శ్రాద్ధం ../ .. ఆమ శ్రాద్ధం హిరణ్య రూపేణ అద్య కరిష్యే | తదంగ తిల తర్పణం చ కరిష్యే |

దక్షిణతో దర్భాన్ నిరస్య | అప ఉపస్పృశ్య |

హిరణ్య శ్రాద్ధం |

అమావాస్యా పుణ్యకాలే అస్మిన్ మయా క్రియమాణే హిరణ్యరూప దర్శ శ్రాద్ధే , ఏక బ్రాహ్మణ సంభవే వర్గ ద్వయ పితృణాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( అనేక బ్రాహ్మణ పక్షే పృథక్ వరణం కుర్యాత్ )

తాంబూలం , హిరణ్యం చ గృహీత్వా ||

|| హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసోః |

అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయఛ్చ మే ||

అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహానాం | ——– గోత్రాణాం. .. ——– , ——— , ——— శర్మణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీనాం … ——— గోత్రాణాం , ——— , ———, ——–దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం … ——- గోత్రాణాం , ———, ——– , ———- శర్మాణాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం

అస్మత్ మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీనాం … ——– గోత్రాణాం ,

——– , —- , ——— దానాం , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాణాం ,

ఉభయ వంశ పితృణాం .. అక్షయ తృప్యర్థం ,దర్శ శ్రాద్ధ ప్రత్యామ్నాయం యద్దేయం అన్నం తత్ ప్రతినిధి హిరణ్యం వర్గ ద్వయ పితృ ప్రీతిం కామయమానః తుభ్యమహం సంప్రదదే | నమమ | ఓం తత్ సత్ | 

ఉపవీతి |

ప్రదక్షిణం |

|| దేవతాభ్యః పితృభ్యశ్చ మహా యోగిభ్యః ఏవ చ |

నమః స్వధాయై స్వాహాయై నిత్యమేవ నమో నమః ||

| యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే |

నమస్కారః

ప్రాచీనావీతి | వర్గ ద్వయ పితృభ్యో నమః | స్వామినః మయా కృతేన హిరణ్య రూప దర్శ శ్రాద్ధేన మమ వర్గ ద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసురితి భవంతోను గృహ్ణంతు | ఇతి ప్రార్థ్య |

( యజమానస్య వర్గద్వయ పితరః సర్వే నిత్య తృప్తా భూయాసుః ఇతి బ్రాహ్మణాశీర్వాదః )

తర్పణమ్

దీనికి ఇచ్చిన బొమ్మ చూడుడు …దర్భలతో కూర్చలు చేసుకొన వచ్చును . 

పితృ దేవతల ప్రీతి కొరకు అర్పించే తిలాంజలినే ’ తర్పణం ’ అంటారు..

ముఖ్య గమనిక :

ఇంటి లోపల తిల తర్పణము నిషిద్ధము..ఇంటి బయట ఆవరణలో గానీ , బాల్కనీ లో గాని లేదా తులసి కోట దగ్గరగానీ తర్పణము ఆచరించవచ్చును..

తండ్రి బ్రతికి ఉన్న వారు తర్పణము ఆచరించరాదు..సజీవులు గా ఉన్న వారిని వదలి , మిగిలిన వారికి మాత్రమే తర్పణము ఇవ్వాలి.

అమావాశ్య , గ్రహణ కాలము , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలాలు , ఆయనములు , సంక్రమణ కాలములందు తర్పణాలు ఇవ్వాలి. అప్పుడు ద్వాదశ పితృ దేవతలకు మాత్రము తర్పణం ఇవ్వాలి అనేది కొందరి మతము. అయితే , సాధారణ సంక్రమణము మరియు అమావాశ్యలందు ద్వాదశ పితృ దేవతలకు , మిగిలిన కాలాలలో సర్వే పితృ తర్పణము చెయ్యడము వాడుక లో ఉంది… వారి వారి సంప్రదాయాన్ని అనుసరించి చేయవచ్చును..

మహాలయ పితృ పక్షమునందు మరియు పుణ్య క్షేత్రములందు సర్వ పితృ దేవతలకూ తర్పణం వదలాలి. మహాలయ పక్షము నందు ఆయా తిథులలో మరణించిన పితృ దేవతలకు ఆయా రోజుల్లో తర్పణం వదలవచ్చు.

తిథులు తెలియని యెడల , అందరికీ అన్ని రోజులూ తర్పణం వదలవచ్చు. అది వీలు కానిచో , కనీసం అమావాశ్య రోజైనా అందరికీ తర్పణం ఇవ్వాలి.. వారి వారి శక్త్యానుసారం చెయ్యవచ్చును.

తర్పణము ఇచ్చునపుడు , మొదట సంబంధము ( మాతుః … పితుః… మాతులః.. ఇలా ) , తరువాత వారి పేరు , గోత్రము చివర పితృదేవతారూపము ( వసు , రుద్ర , ఆదిత్య…. ఇలా ) చెప్పి వదలవలెను..

ఆడవారు సుమంగళి అయిన ’ దేవి ’ అని , కానిచో ’ కవీ ’ అని చెప్పి ఇవ్వాలి.

మాతృ , పితామహి , ప్రపితామహి…ఈ మూడు వర్గాలు తప్ప మిగిలిన స్త్రీలందరికీ ఒక్కొక్కసారి మాత్రమే తర్పణం వదలాలి..

మిగిలినవారికి , వారి వారి సూత్రానుసారముగా చెప్పినటువంటి సంఖ్యలో తర్పణం ఇవ్వాలి…

ఇతర నియమాలు

తర్పణము ఇచ్చునపుడు కుడి చేతి ఉంగరపు వేలికి మూడు దర్భలతో చేసిన పవిత్రం ధరించాలి.

తర్పణానికి ఉత్తమమైన కాలము సుమారు మధ్యాహ్నము 12 గంటలకు . తర్పణము వదలు నపుడు ప్రాచీనావీతి గా ఉండి జంధ్యమును కుడి భుజం పై వేసుకొని ( అపసవ్యము ) ఎడమచేతిలో నీటి పాత్ర పట్టుకొని , కుడి చేతిలో నువ్వులు ఉంచుకుని , చూపుడు వేలు , బొటన వేలు మధ్యనుండి ( పితృ తీర్థం లో ) నీరు , తిలలు వదలాలి

తర్పణము ఈ కింది సందర్భాలలో ఆచరించవచ్చు..

అమావాశ్య మరియు సాధారణ సంక్రమణ కాలములందు

గ్రహణ , అర్ధోదయ , మహోదయ పుణ్యకాలములలో , దక్షిణాయన , ఉత్తరాయణ పుణ్య కాలాలలోను , మహాలయ పితృ పక్షం లోనూ , మరియు తీర్థ క్షేత్రములకు వెళ్ళినపుడు…

ఒకేసారి , ఒకే రోజు రెండు కారణాలవలన రెండు సార్లు తర్పణము ఇవ్వరాదు..ఒకే తర్పణము ఇవ్వాలి..ఉదాహరణకి ,

అమావాశ్య , సంక్రమణము ఒకే రోజు వస్తే , అమావాశ్య తర్పణము మాత్రము ఇవ్వాలి.

దక్షిణాయన / ఉత్తరాయణ పుణ్య కాలాలు అమావాశ్య రోజున వస్తే , ఆయన పుణ్యకాలం లో మాత్రము తర్పణము ఇవ్వాలి..

గ్రహణము , మరియు దక్షిణ / ఉత్తర పుణ్యకాలాలు ఒకరోజే వస్తే , గ్రహణ నిమిత్తం మాత్రం తర్పణం ఇవ్వాలి. ఉత్తరాయణ పుణ్య కాలము , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాలు ఒకే రోజు వస్తే , అర్ధోదయ / మహోదయ పుణ్యకాలాల తర్పణం ఇవ్వాలి..

చంద్ర గ్రహణమైతే గ్రహణ మధ్య కాలము దాటిన తర్వాత , సూర్య గ్రహణమైతే గ్రహణ మధ్య కాలానికన్నా ముందుగాను , తర్పణము ఇవ్వాలి.

సంక్రమణమైతే , పుణ్యకాలంలో ఇవ్వాలి..

విధానము

ప్రాగగ్రాన్ దర్భాన్ ఆస్తీర్య | తేషు దక్షిణాగ్రౌ ద్వౌ కూర్చౌ నిధాయ | ( మూడు దర్భలను బొమ్మలో చూపినట్టు , కొనలు తూర్పుకు వచ్చేలా ఒకదానికొకటి సమాంతరం గా పరచాలి… వాటిపైన రెండు కూర్చ లను , దక్షిణానికి కొనలు వచ్చునట్లు పరచాలి.)

కూర్చలను చెయ్యడానికి : రెండేసి దర్భలను తీసుకుని పైనుంచి ( కొనలనుంచి ) ఆరంగుళాలు వదలి మడవాలి, మడిచినచోట ఒక వృత్తం లాగా చేసి, రెండు సార్లు కొనలను దర్భల చుట్టూ తిప్పి వృత్తం లోనించీ అవతలికి తీసుకొని ముడి వెయ్యాలి. తర్వాత ,

ఆచమనము చేసి , పవిత్రము ధరించి , తర్వాత ప్రాణాయామము చేసి , సంకల్పము ఇలా చెప్పాలి

సంకల్పము : ( దేశకాలౌ సంకీర్త్య ) శ్రీ గోవింద గోవింద మహా విష్ణురాజ్ఞయా ప్రవర్ధమానస్య , అద్య బ్రహ్మణః , ద్వితీయ పరార్థే , శ్వేత వరాహ కల్పే , 

వైవస్వత మన్వంతరే , కలియుగే , ప్రథమపాదే , జంబూద్వీపే , భరత వర్షే , భరత ఖండే , రామ క్షేత్రే , బౌద్దావతారే ,

అస్మిన్ వర్తమానే వ్యావహారికే చాంద్రమానేన , ప్రభవాది షష్టి సంవత్సరణాం మధ్యే , శ్రీ ——నామ సంవత్సరే ( సంవత్సరం పేరు ) , —–ఆయనే ( ఆ కాలపు ఆయనము పేరు ) , ……..ఋతౌ ( ఋతువు పేరు ) , ….. మాసే ( మాసపు పేరు ) , …..పక్షే (శుక్ల .. లేక కృష్ణ పక్షము) ,….తిథౌ ( ఆనాటి తిథి పేరు )….. వాసరే ( ఆనాటి వారము.. భాను ( ఆది ) / ఇందు ( సోమ ) / భౌమ ( మంగళ ) / సౌమ్య ( బుధ ) / బృహస్పతి ( గురు ) / భార్గవ ( శుక్ర ) / స్థిర ( శని ) ….

విష్ణు నక్షత్ర , విష్ణుయోగ , విష్ణు కరణ ఏవంగుణ విశేషణ విశిష్టాయాం పుణ్య తిథౌ

ప్రాచీనావీతి ( జంధ్యము అపసవ్యము గా వేసుకొనవలెను..)

అస్మత్ పిత్ర్యాది ద్వాదశ పితౄణాం అక్షయ పుణ్య లోకావాప్త్యర్థం అమావాశ్యాయామ్ / సంక్రమణ పుణ్య కాలే…

( లేక , సూర్యోపరాగ / చంద్రోపరాగ / అర్ధోదయ / మహోదయ పుణ్య కాలే / దక్షిణాయణ / ఉత్తరాయణ పుణ్యకాలే / కన్యాగతే సవితరి ఆషాఢ్యాది పంచ మహాఽపర పక్షేషు అస్మిన్ పితృ పక్షే సకృన్మహాలయే / గంగా కావేరీ తీరే …..

ఇలా ఏది సందర్భోచితమో దాన్ని చెప్పి )

శ్రాద్ద ప్రతినిధి సద్యః తిల తర్పణమ్ ఆచరిష్యే…

( కింద చెప్పిన విధముగా , తిలోదకాలతో వారి వారి పేరు , గోత్రము , రూపము చెప్పి తర్పణము ఇవ్వాలి..)

మొదట పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.మనకు కుడి వైపున ఉన్న మొదటి కూర్చ లో తండ్రి వైపు పితృ దేవతలను , ఎడమ వైపున ఉన్న రెండో కూర్చలో మాతృ వర్గపు పితృ దేవతలను ఆవాహన చెయ్యాలి.

ప్రథమ కూర్చే ..

|| ఆయాత పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే….——— గోత్రాన్. .. ———( తండ్రి పేరు ) , ………తాతయ్య పేరు , ……..ముత్తాత పేరు శర్మాణః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ , అస్మత్ పితృ , పితామహ , ప్రపితామహాన్ ,

——– గోత్రాః , ——– , ———–, ———దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , అస్మత్ మాతృ , పితామహీ , ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి |

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

పితృ , పితామహ , ప్రపితామహానాం , మాతృ , పితామహీ , ప్రపితామహీనాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం |

( మొదటి కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

ద్వితీయ కూర్చే ( రెండవ కూర్చ పై )

|| ఆయాత మాతుః పితరః సోమ్యా గంభీరైః పతిభిః పూర్వ్యైః |

ప్రజామస్మభ్యం దదతో రయించ దీర్ఘాయుత్వం చ శత శారదం చ ||

ఓం భూర్భువస్సువరోమ్

అస్మిన్ కూర్చే..—— గోత్రాన్ ………( తల్లి యొక్క తండ్రి ) , ……….( తల్లి తాత ), ………( తల్లి ముత్తాత ) శర్మాణః …వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాన్ అస్మత్ మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహాన్ | , ,

——– గోత్రాః ,……..( తల్లి యొక్క తల్లి ) , ………( తల్లి యొక్క అవ్వ ) , ………..( తల్లి యొక్క ముత్తవ్వ ) దాః , వసు , రుద్ర , ఆదిత్య స్వరూపాః , మాతామహీ , మాతుః పితామహీ , మాతుః ప్రపితామహీశ్చ ధ్యాయామి | ఆవాహయామి ||

|| సకృదాఛ్చిన్నం బర్‍హిరూర్ణామృదు | స్యోనం పితృభ్యస్త్వా భరామ్యహం | అస్మిన్ సీదంతు మే పితరః సోమ్యాః | పితామహాః ప్రపితామహాశ్చానుగైః సహ ||

సపత్నీక మాతామహ , మాతుః పితామహ , మాతుః ప్రపితామహానాం ఇదమాసనం | తిలాది సకలారాధనైః స్వర్చితం | ( రెండవ కూర్చ పై నువ్వులు కాసిని చల్లాలి )

పితృ వర్గము వారికి తర్పణము ఇచ్చునపుడు మొదటి కూర్చ పైనను , మాతృ వర్గము వారికి ఇచ్చేటప్పుడు రెండో కూర్చ పైనను నువ్వులు , నీళ్ళు పితృ తీర్థం లో వదలాలి.

ప్రథమ కూర్చే.. …పితృ వర్గ తర్పణం |

౧ పితృ తర్పణం (ఒక్కో మంత్రము చెప్పి ఒక్కోసారి , మొత్తం మూడు సార్లు తండ్రి కి … అలాగే మూడేసి సార్లు ఇవ్వ వలసిన మిగిలిన వారికి )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్ఞాస్తేనోవంతు పితరో హవేషు ||

——– గోత్రాన్. .. ———- శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨. || అంగిరసో నః పితరో నవగ్వా అథర్వాణో భృగవః సోమ్యాసః |

తేషాం వయగ్ం సుమతౌ యజ్ఞియానామపి భద్రే సౌమనసే స్యామ ||

——- గోత్రాన్. .. ——— శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౩. || ఆయంతు నః పితరః సోమ్యాసః | అగ్నిష్వాత్తాః పథిభిర్దేవయానైః | అస్మిన్ యజ్~ఝే స్వధయా మదంత్వధి బ్రువంతు తే అవంత్వస్మాన్ ||

——- గోత్రాన్. .. ———– శర్మణః , వసు రూపాన్ , అస్మత్ పితౄన్ స్వధా నమః తర్పయామి ||

౨.. పితామహ తర్పణం ( మూడు సార్లు తాత కు)

౧. || ఊర్జం వహంతీ రమృతం ఘృతం పయః | కీలాలం పరిస్రుతం | స్వధాస్థ తర్పయత మే పితౄన్ ||

——–గోత్రాన్. .. ——— శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || పితృభ్యః స్వధా విభ్యః స్వధా నమః | పితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః | ప్రపితామహేభ్యః స్వధా విభ్యః స్వధా నమః ||

——- గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || యేచేహ పితరో యే చ నేహ యాగ్ంశ్చ విద్మ యాగ్ం ఉ చ న ప్ర విద్మ | అగ్నే తాన్వేత్థ యదితే జాత వేదస్తయా ప్రత్తగ్గ్ం స్వధయా మదంతు ||

——— గోత్రాన్. .. ———- శర్మణః , రుద్ర రూపాన్ , అస్మత్ పితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. ప్రపితామహ తర్పణం ( మూడు సార్లు )

౧. || మధు వాతా ఋతాయ తే మధుక్షరంతి సింధవః | మాధ్వీర్నః సంత్వోషధీః ||

——– గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౨. || మధునక్త ముతోషసి మధుమత్ పార్థివగ్ం రజః | మధు ద్యౌరస్తునః పితా ||

——- గోత్రాన్. .. ——- శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౩. || మధు మాన్నో వనస్పతిర్మధుమాగ్ం అస్తు సూర్యః | మాధ్వీర్గావో భవంతు నః ||

——- గోత్రాన్. .. ——– శర్మణః , ఆదిత్య రూపాన్ , అస్మత్ ప్రపితామహాన్ స్వధా నమః తర్పయామి ||

౪. మాతృ తర్పణం ( మూడు సార్లు )

—— గోత్రాః , ——— దేవీ ( కవీ ) దాః , వసు రూపాః అస్మత్ మాతౄః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౫.. పితామహీ తర్పణం

——– గోత్రాః , ———దేవీ ( కవీ ) దాః , రుద్ర రూపాః , అస్మత్ పితామహీః , స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౬. ప్రపితామహీ తర్పణం

——— గోత్రాః , ———– దేవీ ( కవీ ) దాః , ఆదిత్య రూపాః , అస్మత్ ప్రపితామహీః స్వధా నమః తర్పయామి || ( మూడు సార్లు )

౭. ద్వితీయ కూర్చే మాతృ వర్గ తర్పణం. ( రెండవ కూర్చ పై )

మాతా మహ తర్పణం ( మూడు సార్లు )

౧. || ఉదీరతా మవర ఉత్పరాస ఉన్మధ్యమాః పితరః సోమ్యాసః |

అసుం య ఈయురవృకా ఋతజ్~ఝాస్తేనోవంతు పితరో హవేషు ||

Language Telugu
No. of Pages5
PDF Size1 MB
CategoryReligion
Source/Creditsarchive.org

Related PDFs

Sundarakanda Complete PDF In Telugu

శ్రీమద్ భగవద్గీత In Telugu PDF

Totakashtakam PDF In Hindi

Totakashtakam PDF In Kannada

Totakashtakam PDF In Tamil

Totakashtakam PDF In Telugu

Apamarjana Stotram PDF In Kannada

Vat Savitri Vrat Katha PDF In Hindi

Dakshinamurthy Ashtakam PDF In Hindi

పితృ తర్పణము – విధానము – Amavasya pitru tarpanam PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!