శ్రీమద్ భగవద్గీత | Bhagavad Gita In Telugu PDF

శ్రీమద్ భగవద్గీత – Bhagavad Gita In Telugu Book PDF Free Download

భగవద్గీత గురించి

శ్రీమద్భగవద్గీత ఒక అత్యద్భుతమైన శాస్త్ర గ్రంథము. ఇటువంటి గ్రంథము ప్రపంచములో మరియొకటి కానరాదనడం అతి శయోక్తి కాదు. ఏలయన?

దీని గ్రంథకర్తయైన శ్రీశ్రీశ్రీశ్రీ వేదవ్యాస మహర్షుల వారు భగవత్స్వరూపుడైన శ్రీకృష్ణుని ముఖతా మానవులనందరిని పూర్వపూర్వ జన్మలయందు తమచే చేయబడిన కర్మల ఫలముగా నాలుగు వర్ణములుగా విభజించి ఆ వర్ణవ్యవస్థయను ధార్మిక పునాదులపై శ్రీమద్భగవద్గీత యనబడుచున్న మహావిశాలము మరియు సుదృఢమైన భవనమును నిర్మింపజేసి దానియందు అన్ని వర్ణములవారు తమతమ వర్ణధర్మములకు కట్టుబడి తమ స్వభావజనితమైన కర్మల నాచరించుచూ, సుఖజీవనము గడపుచూ తుదకు క్రమక్రమముగా జన్మ – మరణ రాహిత్యరూపమైన మోక్షస్థితిని పొందుటకు తగు వ్యవస్థను యేర్పాటు చేసియున్నారు.

అన్ని వర్ణముల వారికి వారివారి స్వభావ కారణముగ యేర్పడిన గుణముల సమన్వయము ననుసరించి విధించబడిన కర్మాధికారమునకు లోబడి ఫలాపేక్షలేక కర్మలు చేయుచూ తుదకు ఆ కర్మల ద్వారానే కలిగిన జ్ఞానబలంతో మోక్ష స్థితిని పొందునట్లుగా యేర్పాటు చేసియున్నారు.

ఈ గ్రంథమునందు అన్ని వర్ణములకు చెందిన మానవులందరికి మోక్షసిద్ధికి అవుసరమగు మార్గములు చూపించియున్నాడు.

ఆకారణముగానే కర్మయోగము, భక్తి యోగము, ధ్యాన యోగము, సాంఖ్యయోగము అనగా జ్ఞానయోగము అను వివిధ యోగములు అనగా మోక్షమును కలిగించు మార్గములు పరస్పర విరోధము లేకుండ చూపెట్టబడినవి.

అయితే గ్రంథం మొత్తములోను ధర్మాచరణము కంటే జ్ఞానసంపాదనమే శ్రేయో దాయకమని చెప్పుచూ నిష్కామ కర్మయోగము ద్వారా మానవ సహజమైన కర్మను బహిష్కరించలేదు.

భగవదర్పిత భావముతో అన్ని వర్ణముల వారు తమకు విధించబడిన | కర్మాధికారము ననుసరించి యెటువంటి కర్మలు చేసినను ఆ కర్మల ఫలములైన పాపపుణ్యములు అనగా సుఖదుఃఖములు వారికి అంటవని మర్మగర్భితముగా చెప్పియున్నారు.

పైగా అజ్ఞానము కారణముగ కర్మల యండు మునిగియున్న వారికి నైష్కర్మ్య భావము అనగా శుద్ధ జ్ఞానరూపమైన అద్వైతతత్త్వమును బోధించరాదనియు,

బోధించినచో వారు చెడిపోవుదురనియు, అందులకు గాను జ్ఞానియైన వారలుగూడ ఆ యజ్ఞానులకు మార్గదర్శకత్వము లభించునట్లుగా నిష్కామ భావముతో కర్మలు చేస్తూనే వుండవలయునని, అందులకు శ్రీ కృష్ణునినే వుదాహరణముగ గ్రహించవచ్చునని వ్యానులవారు బోధించియున్నారు.

సర్వవిధ ధర్మములకు యీ గ్రంథము శత్రుదుర్భేద్యమైనటువంటి కోట వంటిది. అంతేకాదు యీ గ్రంథము హిందూ ధర్మము యొక్క మహోన్నత్యమును, ఉదార స్వభావమును మరియు సర్వజనీనతను వేలాది నోళ్లతో లోకమునందు చాటుతూనే వుంటుంది.

అందువలననే అనగా యీ గ్రంథరాజము యొక్క మహోన్నత్యము కారణముగానే నేటికి షుమారు అయిదు వేలమంది మహాత్ములు యీ గ్రంథమును తమతమ బుధ్యాను సారముగ వ్యాఖ్యానించియున్నారు.

అయినప్పటికీ శ్రీశ్రీశ్రీ జగద్గురువులు ఆది శంకరాచార్యుల వారి భాష్యమునకు సరితూగగల వ్యాఖ్యానము ప్రకటితము కాలేదు.

ఆ కారణముగానే ఆంధ్రభాషా పరిచితులందరికి శ్రీ శంకరభాష్యమును పరిచయము చేయు సద్భావముతో ప్రేరేపించబడిన వాడనై “శ్రీ మద్భగవద్గీత – శ్రీ శంకరభాష్యం యథాతథం” అను నామముతో యీ అనువాద కార్యమును చేసియున్నాను.

ఇందు యేవైన దోషములున్నచో అవన్నియు నా అజ్ఞానమూలముగా దొర్లినవేగాని శ్రీ శంకరులు వారివి కావని విన్నవించుకొనుచున్నాను. నాయందు దయయుంచి, నాదోషములను మన్నించి పండితులైనవారు ఆదోషములను నాకు తెల్పినచో తరువాతి ముద్రణకాలమందు తగురీతిగా సంస్కరించుకోగలవాడనని సవినయముగా ప్రార్థించుచున్నాను.

AuthorMaharshi Vedvyasa
LanguageTelugu
Pages243
PDF Size7.4 MB
CategoryReligious

శ్రీమద్భగవద్గీత తెనుగు గీతములు

Alternative Download Bhagavad Gita in Telugu with meaning

ఈ పుస్తకాన్ని స్వామి నిర్వికల్పానంద గారు తెలుగులో రాశారు. 521 పేజీలు మరియు 71 MB File Size ఉంటుంది. మీకు పద్యం మరియు దాని భావాలతో కూడిన భగవద్గీత బుక్ కావాలంటే పైన ఉన్న లింక్ క్లిక్ చేసి download చేసుకోండి.

Download Here

శ్రీమద్ భగవద్గీత – Bhagavad Gita In Telugu Book PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *