కనకధారా స్తోత్రం | Kanakadhara Stotram PDF In Telugu

కనకధారా స్తోత్రం – Kanakadhara Stotram Telugu PDF Free Download

ముగ్ధ ముహుర్ విదధతీ వదనే మురారే: ప్రేమ ప్రపాత ప్రణిహితాని గతాగతాని! మాలా దృశోర్ మధుకరీవ మహోత్సలే యా సామ శ్రియం దిశతు సాగర సంభవాయాః !!

ఒక పెద్ద కమలము చుట్టుత ఆగి-ఆగి పరిభ్రమించు రుమ్మెద వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లువలెత్తిన ప్రేమను మాటిమాటికిని ప్రసరింపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదల ననుగ్రహించు గాక !

వివరణ: ఈ శ్లోకంలో విష్ణు భగవానుని “మురారే” అని సంబోధించారు బాల శంకరులు. మురారి అంటి ముర అనే రాక్షసుని చంపినవాడు లేదా శత్రువు అని అర్ధం.

మురాసురుడు బ్రహ్మగారి కొరకై తపస్సు చేసి లోకాలన్నీ జయించటంకొరకు తాను ఎవరినైతే ముట్టు కుంటాడో వారు మరణించేటట్టు వరం ఇవ్వమన్నాడు ఇంకో విధంగా అన్వయిస్తే తన చేతితో ముట్టుకున్నదేదో తనచే ఓడింపబడాలి అంటే తన స్వంతమవ్వాలి).

అటువంటి మురాసురుడు తరవాత దేవతలపైకి దండెత్తి వెళితే దేవతలందరూ పెద్ద యుద్ధంలేకుండానే పారిపోయారు. అమరావతిని సొంతం చేసుకుని విలాసాలననుభవిస్తూ తన వాహనంపై లోక సంచారం చేస్తూ భూమిమీదకు వచ్చాడు.

భూమి మీద సరయూ / గంగా తీరంలో రఘుమహారాజు దేవతల కోసం యజ్ఞం చేయటం చూసి కోపగించి దేవతలకు హవిస్సు ఇవ్వరాదు అని ఆజ్ఞాపించాడు.

కూడదంటే తనతో యుద్ధానికి రమ్మన్నాడు. అంతలో వశిష్టుడు అనునయంగా మాట్లాడి ఈ భూమిపై జీవుల నందరినీ యమ ధర్మరాజు సంహరిస్తుంటాడు కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేసి గెలిస్తే అంతా నీదే అవుతుంది అని చెప్పగా మురుడు యమసదనానికి వెళ్ళాడు.

మురుని రాక గురించి వశిష్టుని ఉపాయం గురించి తెలుసుకున్న యమధర్మరాజు, మురునికి స్వాగతం చెప్తాడు. మురుడు యముణ్ణి యుద్ధానికి ఆహ్వానిస్తాడు యుద్ధం వద్దనుకుంటే భూమి మీద ఎవ్వ సంహరించాడు.

అటువంటి శ్రీహరిని తన సాగరమథనం జరిగినప్పుడు అందులోంచి పైకి వచ్చిన తల్లివైన నువ్వు చుట్టూ ఎంతమంది ఇతర దేవతలున్నారో రక్కసులున్నారో కూడా చూడకుండా ముగ్దలా అమాయకురాలిలా ఆ

మురాసురుని సంహరించిన ఆ శ్రీహరి ఈయనే అని కన్నార్పకుండా మోహంతో చూసిన చూపులు మాకు సిరిసంపదలు కటాక్షించుగాక.

అలా చూస్తున్న చూపులు అందరూ చూస్తున్నారని గ్రహించి, కలువ మీద మళ్ళీ మళ్ళీ వచ్చి చేరే ఆడ తుమ్మెద లాగా, నీ చూపులను మరల్చి మరల్చి, తిప్పి తిప్పి, ప్రేమ + సిగ్గుల దొంతరలతో శ్రీ మహావిష్ణువును ముగ్ధ మోహనంగా చూసిన చూపులున్న ఓ తల్లీ॥ లక్ష్మీ దేవీ: మమ్ములను నీ ఆ చల్లని చూపులు అనుగ్రహించుగాక!

సందర్భం ప్రకారం: మురాసురుడంటే ఎవ్వరికీ పెట్టకుండా అంతా తనదీ అని దాచుకునేవాడు. అటువంటి పాపగుణాన్ని ఎవ్వరికీ పెట్టక అంతా నాది నేను అన్న చేయితో సహా శ్రీహరి నిర్మూలించాడు.

పూర్వజన్మలో ఒకరికి పెట్టకనే కదా ఈ జన్మలో ఈ బ్రాహ్మణ కుటుంబం దరిద్రం అనుభవిస్తోంది ఆ దానం చేయని పాపాన్ని శ్రీహరి నిర్మూలించగలడు తల్లీ అని అంతర్లీనంగా మురాసురుని సంహార వృత్తాంతం సంకేతించారు.

AuthorShankaracharya
Language Telugu
No. of Pages23
PDF Size248.0 KB
CategoryReligious

Kanakadhara Stotram Telugu PDF Free Download

Leave a Comment

Your email address will not be published.