‘గజేంద్ర మోక్షం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Gajendra Moksha’ using the download button.
గజేంద్ర మోక్షం – Gajendra Moksha PDF Free Download
గజేంద్ర మోక్షం
భాగవతంలో గజేంద్ర మోక్షం (Gajendra Moksham) అపూర్వ గాధ తనను శరణుకోరిన భక్తులను రక్షించటానికి శ్రీమహావిష్ణువు ఎల్లవేళలా సంసిద్ధంగా ఉంటాడని, అవసరమొచ్చినపుడు వెనుక ముందు చూసుకోకుండా ప్రత్యక్షమవుతాడని తేటతెల్లమవుతుంది.
ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు ఒక అరణ్యంలో ఘోర తపస్సున మునిగి ఉన్నప్పుడు ఒకనాడు ఆ ప్రదేశమునకు అగస్త్య మహాముని చేరుకున్నాడు. తపస్సు నందున్న ఇంద్రద్యుమ్నుడు ఆయన రాకను గమనించలేదు.
తనవంటి మహర్షికి సముచితమైన గౌరవమర్యాదలు ఇవ్వకుండా ఇంద్రద్యుమ్నుడు అవమానిం చాడని కోపించిన ఆ మహర్షి ఆయనను వెయ్యి ఏళ్ళు గజరూపం అనుభవించమని శపించాడు.
అగస్త్య మహాముని శాపప్రకారం ఇంద్రద్యుమ్నుడు గజరూపం ధరించి త్రికూట పర్వత సానువుల్లో గజముల మందతో కలిసి జీవించ సాగాడు.
త్రికూటపర్వత సానువుల్లో ఒక అద్భుతమైన సరోవరం ఉంది. దాని సమీపం లోనే దేవలుడు అనే మహర్షి ఆశ్రమం ఉంది.
ఒకనాడు హుహు అనే గంధర్వుడు తన భార్యతో ఆ సరోవరంలో నగ్నంగా జలకాలాడుతూ చేసిన అల్లరికి కోపించిన దేవలుడు ఆ గంధర్వుడిని ఆ సరోవరంలోనే మొసలియై పడియుండమని శపించాడు.
ఒకనాడు ఏనుగు రూపంలో ఉన్న ఇంద్రద్యుమ్నుడు ఆ సరోవరంలో దాహార్తితో వచ్చి సరోవరంలో అడుగుపెట్టగానే మొసలి రూపంలో ఉన్న హుహు ఏనుగు కాలును కరచి పట్టుకున్నాడు. ఏనుగు మొసలి మధ్య వేయి సంవత్సరాలు యుద్ధం సాగింది.
పెనుగులాడి, పెనుగులాడి ఓపిక, శక్తి నశించిపోయిన ఏనుగు చివరికి శ్రీమహా విష్ణువును శరణు కోరింది. శ్రీమహావిష్ణువు గరుఢవాహనుడై వైకుంఠం నుంచి దిగివచ్చి తన సుదర్శన చక్రంతో ఆ మకరం శిరస్సును ఖండించి ఏనుగును రక్షించాడు.
Language | Telugu |
No. of Pages | 24 |
PDF Size | 2 MB |
Category | Religion |
Source/Credits | ia803407.us.archive.org |
Related PDFs
Sundarakanda Complete PDF In Telugu
శ్రీమద్ భగవద్గీత In Telugu PDF
గజేంద్ర మోక్షం – Gajendra Moksha PDF Free Download