పోలి స్వర్గం కథ | Poli Swargam Katha PDF In Telugu

‘పోలి స్వర్గం కథ’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Poli Swargam Katha’ using the download button.

పోలి స్వర్గం కథ – Poli Swargam Katha PDF Free Download

పోలి స్వర్గం కథ

తెలుగు పంచాంగం ప్రకారం, నేటితో(నవంబర్ 23) కార్తీక మాసం పూర్తి కానుంది. ఆ వెంటనే నవంబర్ 24వ తేదీన గురువారం నాడు మార్గశిర మాసం ప్రారంభమవుతుంది.

హిందూ మత విశ్వాసాల ప్రకారం, ఈ మాసంలోని తొలి రోజున వచ్చే పాడ్యమి తిథి నాడు పవిత్రమైన నదిలో దీపాలను వెలిగించి వదిలేస్తారు.

ఈరోజునే పోలి పాడ్యమి లేదా పోలి స్వర్గం అంటారు. ఇంతకీ పోలి స్వర్గం అంటే ఏమిటి? ఈ పేరేలా వచ్చింది.. అసలు పోలీ అంటే ఎవరు?

ఈ పవిత్రమైన రోజున పాటించాల్సిన ఆచారాలు, పద్ధతులేంటి.. పోలి స్వర్గం కథకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

పోలి స్వర్గం అంటే అందమైన తెలుగింటి మహిళ కథ. పురాణాల ప్రకారం, క్రిష్ణా నది తీరంలోని ఓ గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబం ఉండేది. ఆ కుటుంబంలో మొత్తం ఐదుగురు కోడళ్లు ఉండేవారు. వారందరిలో చిన్న కోడలే పోలి. తనకు చిన్నప్పటి నుంచే పూజలు చేయడం, దేవున్ని ఆరాధించడం వంటి అలవాటు ఉండేది. ఇది తన అత్తకు ఏ మాత్రం నచ్చేది కాదు.

పోలి అత్త తనలాంటి భక్తురాలు మరొకరు లేరనే భ్రమలో ఉండేది. ఆచారాలు, సంప్రదాయాలు, పద్ధతులను పాటించే హక్కు తనకు మాత్రమే ఉందనే అహంకారంతో ఉండేది.

అందుకే కార్తీక మాసం వచ్చిందంటే చాలు చిన్నకోడలిని తప్ప మిగిలిన నలుగురు కోడళ్లను వెంటబెట్టుకుని వెళ్లి స్నానం చేసి దీపాలను నదిలో వదిలొచ్చేది.

అయితే తన చిన్న కోడలైన పోలి దీపం పెట్టకుండా అత్తమ్మ చేసిన ప్రయత్నాలు ఏ మాత్రం సాగలేదు. దీపాలను అందుబాటులో లేకుండా చేసినప్పటికీ, పోలి ఇంటి సమీపంలోని పత్తి చెట్టు నుంచి కొంత దూదిని తీసుకుని దాంతో వత్తులు చేసుకుని, కవ్వానికి ఉన్న వెన్నను రాసి దీపాన్ని వెలిగించింది.

ఆ దీపం కూడా ఎవరికీ కనబడకుండా మేదరబుట్టను కప్పేది. ఇలా పోలి కార్తీక మాసం అంతా దీపాలను వెలిగించింది.

Language Telugu
No. of Pages6
PDF Size0.05 MB
CategoryReligion
Source/Credits

పోలి స్వర్గం కథ – Poli Swargam Katha PDF Free Download

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!