’12 నదుల పేర్లు’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, Size Of the PDF, Page numbers, and direct download Free PDF of ‘Ratha Saptami Vratham Puja Vidhanam’ using the download button.
రథ సప్తమి పూజ విధానం – Ratha Saptami Vrat Puja Vidhanam PDF Free Download
Ratha Saptami Vrat Katha And Puja In Telugu
సూర్యుని ఏకాదశ మంత్రములు : ఓం మిత్రాయ నమః ; ఓం రవయే నమః ; |ఓం సూర్యాయ నమః ; ఓం భానవే నమః ; ఓం ఖగాయ నమః : ఓం పూష్లే నమః ; ఓం హిరణ్యగర్భాయ నమః ; ఓం మరీచయే నమః ; ఓం ఆదిత్యాయ నమః ; ఓం సవిత్రే నమః ; ఓం అర్కాయ నమః; ఓం భాస్కరాయ నమః.
(ఏ రోజున అరుణోదయ కాలంలో సప్తమీతిథి ఉందో, ఆరోజునే స్నానాన్నీ, రథసప్తమీ వ్రతాన్ని చేయాలి. ఒకవేళ రెండు రోజులలోని అరుణోదయాలలోనూ సప్తమి ఉంటే, మొదటిరోజే రధసప్తమిగా భావించాలి.
షష్ఠినాడు ఒంటిపూట భోజనంతో ఉండి, సప్తమినాడు అరుణోదయాన్నే (ఉదయాన్నే) స్నానంచేసి, సువర్ణ రజత-తామ్ర-లోహ|| పాత్రలలో దేనిలోనైనా తైలంపోసి దీపం వెలిగించి, సూర్య ప్రతిమని లిఖించి,
| షోడశోపచారాలతోనూ పూజించాలి. ఆ పుణ్యకాలం సంక్రాంతి పుణ్యకాలం వంటిది. అలాంటి పుణ్యకాలంలో గంగాది నదులలో దీపాలని వదిలి, పితృతర్పణం మొదలైనవి.
ఆచరించి, సూర్యోపాసనచేసినవారికి – గత ఏడు జన్మలలో చేసిన పాపాలూ కూడా తొలగిపోతాయి.
షష్ఠీ సప్తమీ యోగము ‘ పద్మకం అని చెప్పబడుతోంది. ఇటువంటి యోగం వేయి సూర్యగ్రహణాలతో సమానమని గర్గ మహామునిచే బోధించబడింది).
ఇంటిలో ఈశాన్య మూలలో స్థలమును శుద్ధి చేసి, అలికి, బియ్యపు పిండితోగాని, రంగుల చూర్ణములతో గాని, ముగ్గులు పెట్టి, దైవస్థాపన నిమిత్తమై ఒక పీటను వేయాలి.
పీట మరీఎత్తుగాగాని, మరీ పల్లముగా గానీ ఉండకూడదు. పిదప ఆ పీటకు కూడా చక్కగా పసుపురాసి, కుంకుమతో బొట్టు పెట్టి, వరి పిండి (బియ్యపుపిండి) తో ముగ్గు వేయాలి.
సాధారణంగాఅష్టదళపద్మాన్నేవేస్తారు. పూజ చేసేవారు తూర్పుముఖంగా కూర్చోవాలి. ఏ దైవాన్ని పూజింజబోతున్నారో ఆ దైవం యొక్క ప్రతిమనుగాని, చిత్రపటమునుగాని ఆ పీటపై ఉంచాలి.
ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి (పసుపును షుమారు అంగుళం సైజులో త్రికోణ ఆకృతిలో ముద్దగా చేసి, దానికి కుంకుమ బొట్టు పెట్టి, పిదప ఒకపళ్ళెంలోగాని,క్రొత్తతుండుగుడ్డమీదగానిబియ్యంపోసిదానిపై ఒక తమలపాకునుంచి, అందు పసుపు గణపతినుంచి అగరువత్తులు వెలిగించాలి.
ఇపుడు పూజకు కావలసిన వస్తువులను అమర్చుకోవాలి. దీపారాధన నైఋతి దిశలో చేయవలెను.
రథసప్తమీ వ్రతపూజకు కావలసిన ముఖ్య వస్తువులు : సూర్యుని ప్రతిమ
(శక్తి కొలది బంగారం, వెండి లేదా రాగిరేకుపై లిఖించినది) లేదా చిత్రపటము, పువ్వులు,
కొబ్బరికాయలు, పళ్లు, పసుపు, కుంకుమ, గంధం, హారతి కర్పూరం, అక్షతలు, అగ్గిపెట్టె, అగరువత్తులు, వస్త్ర, యజ్ఞోపవీతములు, నివేదనకు ప్రత్యేకముగా సూర్యునికి ప్రీతికరమైన చక్రపొంగలి (క్షీరాన్నం) చేయాలి.
ఇంకను వీలైనచో పిండివంటలు మొ॥వి సిద్ధము చేసుకొనవలెను.
పిమ్మట యజమానులు (పూజచేసేవారు) ఈ దిగువ కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి. ఈ నామములు మొత్తం 24 కలవు.
- ‘ఓం కేశవాయ స్వాహా అని చెప్పుకుని చేతిలో నీరు తీసుకొని లోనికి తీసుకోవాలి.
- ‘ఓం నారాయణాయ స్వాహా’ అనుకుని ఒకసారి
- ‘ఓం మాధవాయ స్వాహా అనుకుని ఒకసారి జలమును పుచ్చుకోవలెను. తరువాత
- ‘ఓం గోవిందాయ నమః’ అని చేతులు కడుగుకోవాలి.
- ‘విష్ణవేనమః’ అనుకుంటూ నీళ్ళు త్రాగి, మధ్య వేలు, బొటనవ్రేళ్లతోక కోవాలి.
- ఓం మధుసూదనాయ నమః’ అని పై పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
- ‘ఓం త్రివిక్రమాయ నమః’ క్రింది పెదవిని కుడినుంచి ఎడమకి నిమురుకోవాలి.
- ‘ఓం వామనాయ నమః’ ‘ఓం శ్రీధరాయ నమః’ ఈ రెండు నామాలు స్మరిస్తూ తలపై కొంచెం నీళ్లు చల్లుకోవాలి.
- ఓం హృషీ కేశాయ నమః ఎడమ చేతితో నీళ్లు చల్లాలి.
- ఓం పద్మనాభాయ నమః పాదాలపై ఒక్కొక్క చుక్క నీరు చల్లుకోవాలి.
- ఓం దామోదరాయ నమః శిరస్సుపై జలమును ప్రోక్షించుకోవలెను.
- ఓం సంకర్షణాయ నమః చేతివ్రేళ్లు గిన్నెలా వుంచి గడ్డము తుడుచుకోవలెను.
- ఓం వాసుదేవాయ నమః వ్రేళ్లతో ముక్కును వదులుగా పట్టుకోవలెను.
- ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః నేత్రాలు తాకవలెను.
- ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః రెండు చెవులూ తాకవలెను.
(ఇక్కడ శ్రీ మహావిష్ణో రాజ్ఞయా అని కూడా చెప్పవచ్చు) ద్వితీయ పరార్థే శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే (మనకు శ్రీశైలము ప్రధాన క్షేత్రము కావున మనము శ్రీశైలమునకు ఏ దిక్కున ఉన్నామో ఆ దిక్కు చెప్పుకొనవలెను), కృష్ణా,
గోదావర్యోః మధ్యప్రదేశే (మనం “ఏఏ నదులకు మధ్యన ఉన్నామో ఆయా నదుల పేర్లు చెప్పుకొనవలెను), శోభన గృహే (అద్దె ఇల్లు అయినచో వసతిగృహే అనియు, సొంత ఇల్లయినచో స్వగృహే అనియు చెప్పుకొనవలెను), సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధౌ అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ……సంవత్సరే, (ఇక్కడ తెలుగు సంవత్సరమను అంటే పూజ చేయునపుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో
ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలెను), ………అయనే, (సంవత్సరమునకు రెండు అయనములు-ఉత్తరాయణము, దక్షిణాయనము.
జనవరి 15 మకర సంక్రమణం మొదలు జూలై 14 కర్కాటక సంక్రమణం వరకు ఉత్తరాయణము, జూలై 15 కర్కాటక సంక్రమణం నుండి మరల జనవరి 14 పెద్దపండుగ అనగా మకర సంక్రమణం వరకు.
Author | – |
Language | Telugu |
No. of Pages | 20 |
PDF Size | 9 MB |
Category | Vrat Katha |
రథ సప్తమి పూజ విధానం –