‘శ్రీ ఆంజనేయ దండకం’ PDF Quick download link is given at the bottom of this article. You can see the PDF demo, size of the PDF, page numbers, and direct download Free PDF of ‘Anjaneya Dandakam’ using the download button.
శ్రీ ఆంజనేయ దండకం – Sri Anjaneya Dandakam PDF Free Download
శ్రీ ఆంజనేయ దండకం
శ్రీ ఆంజనేయ దండకం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేఽహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రంబు నీ నామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటింజేయ నూహించి నీ మూర్తినిం గాంచి నీ సుందరం బెంచి నీ దాసదాసుండనై రామభక్తుండనై నిన్ను నే గొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ జేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై చూచితే దాతవై బ్రోచితే దగ్గరన్ నిల్చితే తొల్లి సుగ్రీవుకున్ మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు పూజించి యబ్బానుజున్ బంటు గావించి యవ్వాలినిన్ జంపి కాకుత్స్థతిలకున్ దయాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానందముప్పొంగ యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీవుడా యంగదా జాంబవంతాది వీరాదులన్ గూడి యాసేతువున్ దాటి వానరానీకముల్ పెన్మూకలై దైత్యులన్ ద్రుంచగా రావణుండంత కాలాగ్ని రూపోగ్రుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి యా లక్షణున్ మూర్ఛనొందింపగా నప్పుడే నీవు సంజీవినిన్ దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదులన్వీరులన్ బోరి శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబులానందమై యుండ నవ్వేళలందున్ విభీషణున్ వేడుకన్ దోడుకన్ వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీరాముతోజేర్చి అయ్యోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమైయున్న నీకన్న నాకెవ్వరున్ గూర్మి లేరంచు మన్నించినన్ శ్రీరామభక్తి ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ నామకీర్తనల్ జేసితే పాపముల్బాయునే భయములున్ దీరునే భాగ్యముల్ గల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సంపత్తులున్ గల్గునే వానరాకార యో భక్తమందార యో పుణ్యసంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి యా తారక బ్రహ్మమంత్రంబు సంధానమున్ జేయుచున్ స్థిరముగా వజ్రదేహంబునున్ దాల్చి శ్రీరామ శ్రీరామ యంచున్ మనఃపూతమైన యెప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండియున్ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారివై రామ నామాంకితధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీ జ్వాల కల్లోల హా వీరహనుమంత ఓంకార శబ్దంబులన్ క్రూరసర్వగ్రహానీకమున్ భూత ప్రేతంబులన్ పిశాచ శాకినీ ఢాకినీ మోహినీ గాలిదయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలన్ బడన్ గొట్టి నీముష్టి ఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ ద్రుంచి కాలాగ్నిరుద్రుండవై బ్రహ్మప్రభాభాసితంబైన నీదివ్య తేజంబునున్ జూచి రారోరి నా ముద్దు నరసింహ యనుచున్ దయాదృష్టి వీక్షించి నన్నేలు నాస్వామి యో ఆంజనేయా నమస్తే సదా బ్రహ్మచారీ నమో వాయుపుత్రా నమస్తే నమస్తే నమః ||.
Author | – |
Language | Telugu |
No. of Pages | 2 |
PDF Size | 0.3 MB |
Category | Religious |
Source/Credits | hariome.com |
శ్రీ ఆంజనేయ దండకం – Anjaneya Dandakam Book PDF Free Download